![]() |
![]() |

బుల్లితెరను ఫాలో అయ్యేవాళ్ళకు యాంకర్ వర్షిణి బాగా తెలుసు. ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫేమస్ బ్యూటీ. ఈమె నటించిన ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయ్యింది. ఈమె కొన్ని మూవీస్ లో చేసింది కానీ అవి ఏమంత పేరు తెచ్చిపెట్టలేదు. తర్వాత బుల్లితెర మీద కొన్ని షోస్ చేసింది. అలాగే కొంతకాలం "ఢీ" షోలో కూడా మెరిసింది. ఇన్స్టాగ్రామ్ లో ఈమెను 1.8 మిలియన్లకు పైగా ఫాలో అవుతూ ఉంటారు.
ఇక ఈవిడ తన గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈమె తన పెళ్లి గెటప్ లో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ శారీలో ఆమె చాలా మంచి కలర్ ఫుల్ గా, పెళ్లికూతురులా రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు ‘బీచ్ సైడ్ వెడ్డింగ్’ అని క్యాప్షన్ కూడా పెట్టింది.
ఈమె ఈ పెళ్లి మేకప్ ఫొటోస్ ని చూసిన కొంత మంది కొంటె ఫాన్స్ మాత్రం "నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా ?" అని అడిగారు. నెటిజన్స్ ఐతే వర్షిణిని తెగ పొగిడేస్తున్నారు. "ఈ శారీలో దేవతలా ఉన్నావ్, లుకింగ్ గార్జియస్" అని కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |